ఆకివీడు రామాలయం పూర్తిపై రఘురామ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఆకివీడు రామాలయం పూర్తిపై టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకివీడులో రామాలయాన్ని నిర్మించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. ...

ఆకివీడు రామాలయం పూర్తిపై రఘురామ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆకివీడు రామాలయం పూర్తిపై టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకివీడులో రామాలయాన్ని నిర్మించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. రెవెన్యూ లెక్కల ప్రకారం అక్కడ 80 ఏళ్ల క్రితమే రామాలయం ఉందని జిల్లా కలెక్టర్ ఎన్వోసీ ఇవ్వడాన్ని సమర్థించింది. దీంతో ఆలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అవడంపై రఘురామ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఆలయం అంశంలో రాముడిదే విజయమని చెప్పారు. అన్ని చిక్కులు వీడటంతో రామాలయాన్ని శరవేగంగా నిర్మిస్తామని తెలిపారు. నవంబర్ చివరి నాటికి డెడ్ ఎండ్ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. మతసామరస్యంతోనే ముందుకు వెళ్తామని చెప్పారు.

ఫౌండేషన్ వర్క్ పూర్తి..

ఇప్పటికే ఆలయం ఫౌండేషన్ వర్క్ పూర్తి చేశామని రఘురామ తెలిపారు. అక్కడ నుంచి మంగళవారం నుంచి పున:ప్రారంభం చేస్తామని తెలిపారు. తాము అనుకున్న మేరకు రామాలయాన్ని పూర్తి చేస్తామని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఆలయ పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఆలయం కట్టుకుంటే తప్పేంటని జడశ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందన్నారు. గన్నవరంలో రెడీ అయిన స్టోన్ అన్నీ తీసుకొచ్చి నమూనా ప్రకారం ఆలయాన్ని నిర్మిస్తామని రఘురామ స్పష్టంచేశారు.

Next Story