‘హైడ్రా’కు భారీగా నిధులు.. రూ.72 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-27 12:52:50  IST  )

‘హైడ్రా’ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

‘హైడ్రా’కు భారీగా నిధులు.. రూ.72 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హైడ్రా నిర్వహణ, మౌలిక వసతులు, కార్యాచరణ వ్యయాల కోసం రూ.72 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజాగా విడుదల చేసిన నిధులతో ‘హైడ్రా’ వ్యవస్థాపక, నిర్వహణ ఖర్చులతో పాటు అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలు, సిబ్బంది వేతనాలు, ఇతర అత్యవసర వాహనాలను కొనుగోలు చేయనున్నారు. మరోవైపు చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు నగరంలో విపత్తు నిర్వహణ (Disaster Management) చర్యలను మరింత వేగవంతం చేసేందుకే ఈ నిధులు విడుదల చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది.



Next Story