- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్లపల్లి యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
జ్వరాల సర్వేలు ముమ్మరం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ అన్నారు. వ్యాక్సిన్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు

దిశ, మేడ్చల్ బ్యూరో : జ్వరాల సర్వేలు ముమ్మరం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ అన్నారు. వ్యాక్సిన్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం చర్లపల్లి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను పరిశీలించి, ఆరోగ్య శాఖ కార్యక్రమాల వివరాలను పోర్టళ్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్ల నిల్వ కోసం వినియోగిస్తున్న ఐఎల్‌ఆర్ రిఫ్రిజిరేటర్‌ను తనిఖీ చేసిన ఆయన, వ్యాక్సిన్లకు అవసరమైన ఉష్ణోగ్రతను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జ్వరాల సర్వేలను ముమ్మరం చేయడంతో పాటు డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే దోమల నివారణ చర్యలు చేపట్టి, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితులకు అవసరమైన మందులు, సామగ్రి సిద్ధంగా ఉంచాలని డా. ఆనంద్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.






