- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయం వద్ద చావు అంచులకు భక్తుడు.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన పోలీస్
by Vemula.Srinu Prasad |
కాకినాడ జిల్లా తుని మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో ఊహించని ఘటన జరిగింది. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై కింద పడిపోయారు..

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తుని మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో ఊహించని ఘటన జరిగింది. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై కింద పడిపోయారు. ఊపిరి ఆడక విలవిలలాడుతున్న అతడిని చూసి అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న కోటనందూరు ఎస్సై రామకృష్ణ తక్షణమే స్పందించారు. బాధితుడి వద్దకు వెళ్లి సీపీఆర్ (CPR) చేశారు. కొన్ని నిమిషాల పాటు వరుసగా సీపీఆర్ అందించడంతో ఆ భక్తుడిలో చలనం వచ్చింది. దీంతో భక్తుడు శ్వాస తీసుకున్నారు. వెంటనే మెరుగైన వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చావు అంచుల వరకు వెళ్లిన వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎస్సై రామకృష్ణ ఉన్నతాధికారులు విశేషంగా కొనియాడారు. ప్రాణదాతగా నిలిచిన ఎస్సైపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






