అన్నారం పేదల భూములపై టీజీఐఐసీ నీడ.. రైతుల ఆందోళన

by Batti.Sumithra |

గుమ్మడిదల మున్సిపల్ అన్నారం సర్వేనంబర్ 261 లో గల పేదల భూములను తెలంగాణ టీజీ అయి ఇచ్చేది లేదని అన్నారం గ్రామస్తులు అంటున్నారు.

అన్నారం పేదల భూములపై టీజీఐఐసీ నీడ.. రైతుల ఆందోళన
X

దిశ, జిన్నారం : గుమ్మడిదల మున్సిపల్ అన్నారం సర్వేనంబర్ 261 లో గల పేదల భూములను తెలంగాణ టీజీ అయి ఇచ్చేది లేదని అన్నారం గ్రామస్తులు అంటున్నారు. అన్నారం గ్రామానికి చెందిన అఖిల పక్ష నాయకులు, బాధిత రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములను టీజీ ఐఐసీ ఇవ్వమని జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు. సర్వేనెంబర్ 261 లో నిరుపేద బడుగు బలహీన వర్గాల వారికి మాత్రమే అసైన్డ్ భూములు ఉన్నాయని, ఆ రైతులు ఆ భూముల పై జీవనం కొనసాగిస్తున్నారని కలెక్టర్ కి తెలిపారు. టీజీ ఐఐసీకి ప్రభుత్యం ఆ భూములని ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వం వెంటనే టీజీ ఐఐసీ కేటాయించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని రైతులు, గ్రామ నాయకులు డిమాండ్ చేశారు.

Next Story