మరణంలోనూ వీడని బంధం..

by Kodari Anjali |

ఏడడుగులు.. మూడుముళ్ల బంధంతో ఒక్కటై సంసార జీవితం గడిపిన ఆ దంపతులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు.

మరణంలోనూ వీడని బంధం..
X

దిశ నార్కట్ పల్లి: ఏడడుగులు.. మూడుముళ్ల బంధంతో ఒక్కటై సంసార జీవితం గడిపిన ఆ దంపతులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు. నార్కట్ పల్లి మండలం తొండలవాయి గ్రామానికి చెందిన శనిగారపు బాలయ్య ఆదివారం మృతి చెందగా, తన భార్య శనిగారపు చంద్రమ్మ సోమవారం మృతి చెందింది. భార్యాభర్తలిద్దరూ ఒక్కసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తన భర్త మరణాన్ని తట్టుకోలేకనే భార్య మృతి చెందిందని కుటుంబ సభ్యులు రోధించారు. భార్యాభర్తలు మరణంలోనూ వీడని బంధాన్ని రాసుకున్నారని గ్రామస్తుల నోట మాట.

Next Story