బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం

by Taduka Kalyani |

బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి మొత్తం 17 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఎస్పీ నేరుగా ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలకు వేగంగా పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డేలో అందిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో వాటి పరిష్కారం మరింత వేగవంతమవుతోందని ఎస్పీ పేర్కొన్నారు.

Next Story