- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘట్‌కేసర్‌లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ఘట్‌కేసర్‌లో ఆరు అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

దిశ, ఘట్కేసర్ః ఘట్‌కేసర్‌లో ఆరు అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఘట్‌కేసర్ మండలంలోని రెండు అంగన్‌వాడీ సెక్టార్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆరు అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొర్రెముల సెక్టార్ పరిధిలో ప్రతాపసింగారం కేంద్రం (బీసీ-డి), మిత్రానగర్ డిసేబుల్ కాలనీ (బీసీ-ఏ) రోస్టర్ కేటగిరీలకు కేటాయించగా, ఘట్‌కేసర్ సెక్టార్ పరిధిలో అంకుషాపూర్ (ఎస్సీ గ్రూప్-III), అవుషాపూర్ (బీసీ-సి), మరిపల్లిగూడ (ఈడబ్ల్యూఎస్), ఘట్‌కేసర్ కేంద్రం (ఓసీ)కు పోస్టులు కేటాయించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి, స్థానికత నిబంధనలను పూర్తి చేసిన మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 5వ తేదీతో గడువు ముగియనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు ముగిసే లోపు సంబంధిత సీడీపీఓ కార్యాలయం సూచించిన విధానంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని తెలిపారు.






