- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్రమణకు గురైన చెరువు సర్వే..!
by Batti.Sumithra |
ఆక్రమణకు గురవుతోందని బెల్లం చెరువు సర్వే పనులను సోమవారం రెవెన్యూ అధికారులు ప్రారంభించారు.

X
దిశ, కుబీర్ : ఆక్రమణకు గురవుతోందని బెల్లం చెరువు సర్వే పనులను సోమవారం రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. బెల్గాం, బెల్గాం తండా-1, 2 గ్రామాల పశువులను కొందరు ఆక్రమణదారులు చెరువుకు నీళ్లు తాగించడానికి, మేపడానికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఇటీవల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. చెరువును పూర్తిస్థాయిలో సర్వే చేసి ఆక్రమణదారులను తొలగించాలని, సంబంధిత శాఖ అధికారులు హద్దులను నిర్ణయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పశువులకు ఎక్కడా తాగునీరు దొరకని పరిస్థితి ఉందని వారు తెలిపారు. పశువులకు నీళ్లు తాగించేందుకు వచ్చిపోయే దారులను సైతం చూపించి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరుతున్నారు.
Next Story






