గ్రామీణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టండి..

by Taduka Kalyani |

మండలంలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం పెంచి, లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డిఆర్డిఓ) గీత అధికారులను ఆదేశించారు.

గ్రామీణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టండి..
X

దిశ,​హుజూరాబాద్ రూరల్ : మండలంలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం పెంచి, లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డిఆర్డిఓ) గీత అధికారులను ఆదేశించారు. సోమవారం హుజూరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆ శాఖ అధికారులతో కలిసి ఆమె సమీక్ష జరిపారు. ​ఈ సందర్భంగా డిఆర్డిఓ గీత మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరుతో పాటు జలసిరి, వనమహోత్సవం, గ్రామీణ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా వివో భవనాల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌ల నిర్వహణ అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.​ఈ సమీక్షా సమావేశంలో ఎంపీడీవో టి. సునీత, ఎం పీఓ రాజేందర్, ఎపిఎమ్ లత, ఎపిఓ స్వామిలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, ఐకేపీ సీసీలు, వివోఏలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story