- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో యూపీ అసెంబ్లీ స్పీకర్ దంపతుల పర్యటన
by Vemula.Srinu Prasad |
తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, వారి సతీమణి అనితా మహానా సోమవారం సందర్శించారు. వారికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వాగతం పలికారు...

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, వారి సతీమణి అనితా మహానా సోమవారం సందర్శించారు. వారికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ స్పీకర్ దంపతులను శాలువా, పుష్ప గుచ్ఛంతో సన్మానించి మెమెంటో బహుకరించారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో సమావేశమైన ఇరువురు స్పీకర్లు తెలంగాణ, ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వాహణపై ముచ్చటించారు. అసెంబ్లీలు నడుస్తున్న తీరుతెన్నులు, సభా కార్యక్రమాల నిర్వహణకు తీసుకుంటున్న అంశాలపైన గడ్డం ప్రసాద్ కుమార్, సతీష్ మహానా చర్చించుకున్నారు. ఈ సమావేశంలో శాసన మండలి సెక్రటరీ వి. నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ, రేండ్ల తిరుపతి, అసెంబ్లీ, శాసనమండలి అధికారులు పాల్గొన్నారు.
Next Story






