సర్కార్ ఆఫీసులో మౌలిక వసతులు కరువు..

by Kodari Anjali |

తాహసీల్దార్ కార్యాలయంలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్న ఆఫీసర్లు ప్రజలు తాహసీల్దార్ కార్యాలయంలో బాత్రూంల్ లేక గదులు లేక అవస్థలు పడుతున్నారు.

సర్కార్ ఆఫీసులో మౌలిక వసతులు కరువు..
X

దిశ, సదాశివ నగర్: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలోని స్థానిక తాహసీల్దార్ కార్యాలయంలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్న ఆఫీసర్లు ప్రజలు తాహసీల్దార్ కార్యాలయంలో బాత్రూంల్ లేక గదులు లేక అవస్థలు పడుతున్నారు. తాహసీల్దార్ కార్యాలయం పక్కన మూతపడ్డ పాత భవనం ఉండడం అది పూర్తిగా కూల్చివేయాలని స్థానికులు పేర్కొంటున్నారు. అక్కడి నుండి విషపురుగులు, నీరు నిల్వ ఉండటంతో దోమ లు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని తాహసీల్దార్ కార్యాలయంలో ఇరుకైన గదులతో ఇబ్బందికర వాతావరణం నెలకొందని స్థానికులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల స్పందించి స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని తాహసీల్దార్ పక్కన మూతబడ్డ భవనాన్ని పూర్తిగా కూల్చివేయాలని. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో సదాశివనగర్ తాహసీల్దార్ ఆకుల సత్యనారాయణ, సిబ్బంది చురుగ్గా పనిచేయడం అభినందనీయమని మండల ప్రజలు అభిప్రాయపడ్డారు. చుట్టుపక్కల నుండి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు. సదాశివ నగర్ తాహసీల్దార్ కార్యాలయంలో తాహసీల్దార్ సత్యనారాయణ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు సిబ్బంది కూడా రేషన్ కార్డు. కులం సర్టిఫికెట్.. ఆదాయం సర్టిఫికెట్, రెసిడెన్సి సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్ కోసం వచ్చిన ప్రజలకు తాహసీల్దార్ సిబ్బంది అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం పట్ల మండల ప్రజలు స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

Next Story