- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి లో స్వీకరించిన ప్రజల అర్జీలను జాప్యం లేకుండా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని మేడ్చల్–మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్,విజయేందర్ రెడ్డిలు అధికారులను ఆదేశించారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజావాణి లో స్వీకరించిన ప్రజల అర్జీలను జాప్యం లేకుండా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని మేడ్చల్–మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్,విజయేందర్ రెడ్డిలు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డీఆర్వో మాలతీలతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 106 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ప్రజలు వ్యయప్రయాసలకోర్చి ప్రజావాణికి వస్తున్నారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అందువల్ల ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులో పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.తిరస్కరించే దరఖాస్తుల విషయంలో తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా అర్జీదారులకు తెలియజేయాలని, అలాగే స్వీకరించిన అర్జీలపై తీసుకున్న చర్యలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగురాలి చెంతకు వెళ్లి దరఖాస్తు స్వీకరణ
కాగా ప్రజావాణి కార్యక్రమం ముగిసిన తర్వాత హాల్ లోకి సూరారం ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలు ఉమా హాల్ లోకి వచ్చారు.సార్ తన దరఖాస్తును స్వీకరించాలని ఉమా గట్టిగా కేక వేయడంతో..గమనించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆమె వద్దకు వెళ్లి దరఖాస్తును స్వీకరించారు. గతంలో తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించినప్పటికీ, పొజిషన్ ఇవ్వలేదని ఉమా వేడుకోవడంతో తక్షణమే పరిశీలించి,న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఎంఎంసీ ప్రజావాణిలో 22 వినతులు
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 22 వినతులు అందాయి. ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి, జాప్యం లేకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.శాఖల వారీగా పరిశీలిస్తే టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 12, ఇంజినీరింగ్ విభాగానికి 7, రెవెన్యూ విభాగానికి 1, శానిటేషన్ విభాగానికి 1, వెటర్నరీ విభాగానికి 1 చొప్పున వినతులు అందాయి.






