ఎఫ్‌ఐఆర్‌లు ఎత్తేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం: కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ అల్టిమేటం

by Kema Shiva Kumar |

ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ బీహార్, బెంగాల్‌లలో విద్యార్థులను అరెస్టు చేయడాన్ని సీజేపీ తీవ్రంగా ఖండించింది.

ఎఫ్‌ఐఆర్‌లు ఎత్తేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం: కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ అల్టిమేటం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నీట్’ ఆందోళన వేళ విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మళ్లీ ఆందోళనలకు దిగుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా (Ashutosh Ranka) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోమని కేంద్రం ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో వాలంటీర్లపై నిఘా ఉంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

అదేవిధంగా అశుతోష్ రంకా కేంద్రం ఎదుట కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అందులో విద్యార్థులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే రద్దు చేయాలని కోరారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను, వాలంటీర్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసుల ఉపసంహరణపై కేంద్రం కుదుర్చుకున్న లిఖితపూర్వక ఒప్పందాన్ని విడుదల చేయాలన్నారు. ఒకవేళ తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే తాము మళ్లీ నిరసనలకు దిగాల్సి వస్తుందని అశుతోష్ రంకా హెచ్చరించారు.

Next Story