- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి ఇంటికి 'కుటుంబ రిజిస్టర్' సర్టిఫికెట్
రాష్ట్ర ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం త్వరలోనే 'కుటుంబ రిజిస్టర్' విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం త్వరలోనే 'కుటుంబ రిజిస్టర్' విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలు అధికారిక రికార్డు రూపంలో భద్రంగా అందుబాటులో ఉంటాయి. పౌరులు వివిధ ప్రభుత్వ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు పొందడానికి పదే పదే కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సులభంగా సేవలు పొందేందుకు ఈ రిజిస్టర్ దోహదపడనుంది. అర్హులైన పౌరులకు మీ సేవ (Meeseva) కేంద్రాల ద్వారా అధికారికంగా 'కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్' జారీ చేయబడుతుంది. ప్రజలు ఈ సర్టిఫికెట్ కోసం నేరుగా మీ సేవ కేంద్రాలను సందర్శించవచ్చు లేదా 'మీ సేవ ఆన్లైన్ పోర్టల్', మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజలకు సమయం.. శ్రమ ఆదా అయ్యేలా ఈ 'కుటుంబ రిజిస్టర్' వ్యవస్థను త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.






