Lok Sabha: యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చకు టైమ్ ఫిక్స్.. లోక్‌సభ రేపటికి వాయిదా

by Kema Shiva Kumar |

యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేశారు.

Lok Sabha: యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చకు టైమ్ ఫిక్స్.. లోక్‌సభ రేపటికి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను, నిరుద్యోగ యువతను వేధిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలకమైన ‘యాంటీ-పేపర్ లీక్ బిల్లు’పై (Anti-Paper Leak Bill) రేపు లోక్‌సభలో విస్తృత చర్చ జరగనుంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రకటన చేస్తూ, లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.

రేపే చర్చ, ఓటింగ్.. బిల్లుకు ఆమోదం

సభా నిర్వహణ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సభ ముందుకు రానున్న తదుపరి విధివిధానాలను వెల్లడించారు. ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థుల, అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో సమగ్రంగా చర్చించనున్నారు. బిల్లుపై ప్రజాప్రతినిధుల మాట్లాడటం, చర్చ పూర్తయిన వెంటనే సభలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. సభ్యుల ఓటింగ్‌ అనంతరం ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించనుంది. కాగా, యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు ద్వారా నిర్వహించే రిక్రూట్‌మెంట్, ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లలో జరిగే అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, కాపీయింగ్ రాయడం వంటి అక్రమాలకు పాల్పడే నిందితులకు 5 ఏళ్ల నుంచి 10 వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తూ కఠిన చర్యలు తీసుకునే నిబంధనలను పొందుపరిచారు. ఈ బిల్లు చట్టంగా మారితే దేశంలో పేపర్ లీకేజీలకు చెక్ పడుతుందని అంతా భావిస్తున్నారు.

Next Story