- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ వ్యాన్‌ను ఆపిన 'ఫైర్ బ్రాండ్' రియాపై ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్ పోలీసులను ఆశ్రయించిన మోడల్
ముంబైలోని శివాజీ పార్క్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు వ్యాన్‌ను ఒట్టి చేతులతో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన మోడల్ రియా యాదవ్ అహిర్ (27) తాజాగా పోలీసులను ఆశ్రయించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబైలోని శివాజీ పార్క్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు వ్యాన్‌ను ఒట్టి చేతులతో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన మోడల్ రియా యాదవ్ అహిర్ (27) తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తన ఫోటోలు, వీడియోలు వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు తనపై తీవ్ర స్థాయిలో వేధింపులకు, క్యారెక్టర్ అసాసినేషన్ (స్లట్-షేమింగ్)కి పాల్పడుతున్నారని మహారాష్ట్ర సైబర్ సెల్, ముంబై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
తప్పుడు ప్రచారంపై ఫైర్..
తాను అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేసి విక్రయిస్తున్నానని కొందరు కంటెంట్ క్రియేటర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రియా ఫిర్యాదులో పేర్కొంది. తన బ్యాంక్ అకౌంట్లకు అలాంటి ప్లాట్‌ఫామ్‌లతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కావాలనే తన ప్రతిష్టను దిగజార్చేందుకు, తన కుటుంబ భద్రతకు ముప్పు కలిగించేలా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నన్ను ట్రోల్ చేస్తున్నది ఎవరో నాకు తెలుసు.. వారిని వదిలిపెట్టను. తమ అభిప్రాయాలను చెప్పే హక్కు అందరికీ ఉంది, కానీ ఎదుటి వారిని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. తప్పును ఎదిరించే నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని రియా తేల్చి చెప్పింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పోలీసుల స్పందన..
రియా ఆన్‌లైన్ ఫిర్యాదును స్వీకరించామని, వాస్తవాలను నిర్ధారించడానికి మరియు తదుపరి విచారణ కోసం ఎంఐడీసీ (MIDC) పోలీస్ స్టేషన్‌కు దానిని బదిలీ చేసినట్లు డీసీపీ దత్తా నలవాడే వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..?
నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో సీజేపీ (CJP) చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా జులై 22న ముంబైలోని శివాజీ పార్క్‌లో నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో అరెస్టయిన యువతను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌ను వర్షంలో తడుస్తూ రియా అడ్డుకున్న వీడియో వైరల్ అయింది. దీంతో ఆమె ముంబై విద్యార్థి ఉద్యమానికి ఒక ముఖచిత్రంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జులై 25న ఈ నిరసనలను విరమించారు.






