నీటి వనరులను సంరక్షించుకోవాలి

by Taduka Kalyani |

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

నీటి వనరులను సంరక్షించుకోవాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐడిఓసి సమావేశపు మందిరంలో సోమవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ సమన్వయ సమావేశం, మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో వాటర్ మరియు శానిటేషన్ మిషన్ సమీక్ష సమావేశం, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్నె షిప్ పథకం గురించి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్, శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బాలల సంరక్షణకు ముందుండాలన్నారు.

పీఎం ఇంటర్నె షిప్ పథకం పై అవగాహన అవసరం

ఈనెల 29న ఎంపీడీవోలు చైర్మన్ గా తమ మండలాల్లో ఎల్ నినో, జలసిరి, విబిజి రాంజీ, విద్య, తదితర అంశాలపై మండల ప్రజా పరిషత్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి ఇంటర్నె షిప్ పథకంపై నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఫలితంగా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, శిక్షణ సమయంలో స్టైఫండ్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పథకానికి సంబంధించిన గోడపత్రికలను పలువురు జిల్లా అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రాజ్ కుమార్, డిడబ్ల్యూఓ సునంద, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, మిషన్ భగీరథ ఈఈ పరమేశ్వరి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story