సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్

by Kema Shiva Kumar |

సింగరేణి నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాన కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి వ్యతిరేక విధానాలను కేసీఆర్ అవలంభించారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో బ్లాక్‌ వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రధానిగా మోడీ వచ్చాక సింగరేణి విద్యుత్ ఉత్పత్తి సంస్థకు ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌ను కేటాయించారని గుర్తు చేశారు. సింగరేణికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు భారీగా బకాయిలు పెట్టాయని అన్నారు. సింగరేణి నష్టాలకు ఈ రెండు పార్టీలో కారణం అయ్యాయని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు సింగరేణి భవిష్యత్తు కోసం తాడిచర్ల కోల్ బ్లాక్-2 కేటాయించామని కిషన్ రెడ్డి అన్నారు. మణుగూరులోని PKOC బ్లాక్ కూడా సింగరేణికే దక్కాలని భావించామని, అనూహ్యంగా సింగరేణికి పోటీగా జెన్‌కో వేలం పాల్గొన్నదని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జెన్‌కోను వేలంలో పాల్గొనకుండా చూడాలన్నారు.

కేసీఆర్ హయాంలోనూ పేపర్ లీక్‌లు..

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోను పేపర్ లీక్‌లు విచ్చలవిడిగా జరిగాయని కిషన్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇటీవల పదో తరగతి పరీక్షా పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను రాజీనామా చేయకుండా ఇతరులను అడగడం సరికాదని చురకలంటించారు. దేశ హితం కోసం ఏ వ్యవస్థ వచ్చినా తప్పు లేదని.. దేశానికి నష్టం చేసే వ్యవస్థ వస్తే ప్రమాదకరమని కిషన్ రెడ్డి అన్నారు.

Next Story