- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూసుకొస్తున్న 'రిజర్వేషన్ హటావో మూవ్‍మెంట్'.. పార్టీలతో కానిది జెన్ జీ తో సాధ్యమయ్యేనా?
కుల ప్రస్తావన లేకుండా సరికొత్త చట్టం తీసుకురావాలని 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' (RHA) పేరుతో మొదలైన డిజిటల్ పోరాటం సంచలనం సృష్టిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన సక్సెస్ కావడంతో దేశంలో ఇదే తరహాలో మరికొన్ని పోరాటాలు పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మరొక భారీ డిజిటల్ ఉద్యమం మొదలైంది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, దేశంలో కులం ప్రస్తావన లేకుండా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ప్రధాన డిమాండ్‍తో 'రిజర్వేషన్ హటావో మూవ్ మెంట్' ప్రారంభమైంది. విద్య, ఉద్యోగ అవకాశాలలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ అందరికీ సమాన ప్రాతిపదికన ఫలాలు అందేలా చట్ట సవరణలు చేయాలని ఆర్‍హెచ్ఏ డిమాండ్ చేస్తోంది.
కులం, రిజర్వేషన్లు పోవాలి:
ఈ ఉద్యమంపై ఆర్ హెచ్ఏ ప్రతినిధులు స్పందిస్తూ తమ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి సంబంధం లేదని ఇది ఏ రకమైన రాజకీయ ప్రాతిపదికన నడిచే ప్రచారం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టాల్లో ఎక్కడా 'కులం' ప్రస్తావన లేకుండా సరికొత్త చట్టాన్ని తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యం పేర్కొన్నారు. కుల వివక్షను నిర్మూలించడం తమ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వాలు చెబుతున్నాయని ఇదే నిజమైతే ప్రజల రోజువారీ జీవితంలో కుల గుర్తింపును అడగడం లేదా గుర్తించడం ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రవర్ణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలంతా తమ కులాన్ని ప్రదర్శించడం చట్టవిరుద్ధం చేయాలని డిమాండ్ చేశారు. సాధారణ ప్రభుత్వం, విద్యాసంస్థల ప్రవేశాలు, ఉద్యోగ దరఖాస్తులు, ఇతర ప్రజా సంబంధిత ప్రక్రియల్లో ఏ పౌరుడూ తన కులాన్ని వెల్లడించాల్సిన లేదా నమోదు చేయాల్సిన అవసరం ఉండకూడదని, ఇందుకోసం కులం, రిజర్వేషన్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
గంటల వ్యవధిలో లక్షల్లో ఫాలోవర్స్:
అజిత్ అనే వ్యక్తి ఆర్‍హెచ్ఏ పేరుతో ఇన్ స్టా గ్రామ్ ఖాతాను ప్రారంభించగా అతి తక్కువ కాలంలోనే లక్షల్లో ఫాలోవర్స్ పెరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఖాతాకు 4.2 మిలియన్ ఫాలోవర్స్ రావడం ఇదంతా కేవలం గంటల వ్యవధిలోనే జరిగిపోవడం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల విధానంపై సరికొత్త చర్చ ప్రారంభానికి దారి తీసింది. అనేక మంది నెటిజన్లు ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. మద్దతు తెలపాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పూట పూటకు మద్దతు పెరుగుతున్న ఈ మూవ్‍మెంట్ ఇప్పుడు దేశంలో మరో సంచలనంగా మారపోతోందా అనే చర్చ మొదలైంది. అయితే చిన్న ఆలోచనతో మొదలైన సీజేపీ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆర్ఎహ్ఏ మూవ్ మెంట్ దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కారణం కాబోతోంది ఆసక్తి రేపుతోంది.
జాతీయ రాజకీయాల్లో పెను మార్పు?:
విభిన్న కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, జాతుల సమాహారంతో కూడిన మన దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో కులం లేకపోతే రిజర్వుషన్లు ఎక్కడివి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇదిలా ఉంటే దేశ రాజకీయాల్లో రిజర్వేషన్లు పొలిటికల్ సెంటిమెంట్‍గా మారింది. రిజర్వేషన్ల అంశంతో పెట్టుకుంటే తమ అస్థిత్వానికే ప్రమాదం అనే భయం పార్టీల్లో కొనసాగుతోంది. అందువల్లే రిజర్వేషన్లు తొలగించాలనే చర్చ చాలా కాలం నుంచి వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ పని చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రవర్ణాల్లోని పేదల కోసం 10 శాతం కోటాతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురాగా ఇది తమ వర్గాలకు తీరని అన్యాయానికి గురి చేస్తోందని ఓబీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‍ను ఎత్తేసి జనాభా దమాషా, రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో గంటగంటకు పుంజుకుంటున్న రిజర్వేషన్ హటావో ఆందోళన్ దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కారణం కాబోతుదో వేచి చూడాలి.






