శాకంబరిగా విద్యా సరస్వతి

by Batti.Sumithra |

ఆషాఢ మాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవస్థానంలో అమ్మవారు సోమవారం శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.

శాకంబరిగా విద్యా సరస్వతి
X

దిశ, వర్గల్ : ఆషాఢ మాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవస్థానంలో అమ్మవారు సోమవారం శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆషాఢమాసంలో దేవీ ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. శాకంబరి అలంకరణను దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Next Story