- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోయా చాప్ తింటున్నారా? వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్.. అసలు నిజం ఏంటి?
సోయా (మీల్ మేకర్) అంటే ఇష్టపడే వారు ఈ వీడియో చూస్తే ఇక జీవితంలో దాని వంక కన్నెత్తి కూడా చూడరు. సోయా చాప్ తయారీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోయా (మీల్ మేకర్) అంటే ఇష్టపడే వారు ఈ వీడియో చూస్తే ఇక జీవితంలో దాని వంక కన్నెత్తి కూడా చూడరు. సోయా చాప్ తయారీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర దుమారం రేపుతోంది. ఒక ఫ్యాక్టరీలో సోయా పిండిని నేల పై పరించి దానిపై షర్ట్ లేకుండా ఒక వ్యక్తి పడుకోని ఆగమాగం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లకు తీవ్ర అసహ్యం, ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
వైరల్ అవుతున్న ప్రచారం..
ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 27లో ఉన్న ఒక ఫుడ్ తయారీ యూనిట్‌కు చెందినదిగా సోషల్ మీడియా (Instagram, X)లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నెట్టింట వైరల్ అవుతున్నట్లుగా ఇది నోయిడా ఫ్యాక్టరీలో ఇటీవల జరిగిన ఘటన కాకపోవచ్చని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆగ్రాకు చెందిన ఒక పాత వీడియో అని, ఇప్పుడు కొత్త క్యాప్షన్‌తో మళ్లీ ప్రచారంలోకి వచ్చిందని తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఈ వీడియో చూసిన వారంతా ‘ఇక ఎప్పటికీ సోయా తినం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆహార భద్రతా అధికారులను ట్యాగ్ చేస్తూ, ఇలాంటి ఫుడ్ తయారీ కేంద్రాలపై కఠినమైన తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజా నిజాలు తేలాల్సి ఉంది..
సోషల్ మీడియాలో ఒక పాత వీడియో, తప్పుదోవ పట్టించే క్యాప్షన్లు లేదా వేరొక ప్రాంతం పేరుతో వైరల్ కావడం కొత్తేమీ కాదు. రెస్టారెంట్లు, రోడ్డు పక్కన బండ్లు, ఫ్యాక్టరీల్లో అపరిశుభ్రతపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో మరింత భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ వీడియో ఎక్కడిది, ఎప్పటిది అనే దానితో సంబంధం లేకుండా, ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి వెళ్లినందున దీనిపై సరైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అప్పటివరకు, కేవలం సోషల్ మీడియా వీడియోలను చూసి ఒక నిర్ణయానికి రాకుండా, వాస్తవాలను ధృవీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికారులు స్పందిస్తేనే ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న పూర్తి నిజం బయటకు వస్తుంది.






