ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశాలతో కోయిల్ సాగర్ కు నీళ్లు

by Taduka Kalyani |

ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటక నుంచి జూరాలకు భారీగా వరద రావడంతో రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధికారులతో మాట్లాడి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశాలతో కోయిల్ సాగర్ కు నీళ్లు
X

దిశ,దేవరకద్ర/చిన్న చింతకుంట: ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటక నుంచి జూరాలకు భారీగా వరద రావడంతో రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధికారులతో మాట్లాడి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశాల మేరకు అధికారులు చిన్నచింతకుంట మండలం, ఉంద్యాల గ్రామంలో ఉన్న పంప్ హౌస్ స్టేజ్ వన్ నుంచి కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జిఎంఆర్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story