14 ఏళ్ల పిల్లాడికి లారీ స్టీరింగ్ ఇచ్చిన డ్రైవర్.. మందలించిన ఎమ్మెల్యే

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-27 09:28:00  IST  )

మైనర్లతో డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు, ప్రభుత్వం అవగాహన కల్పించినప్పటికీ కొందరికి అవేవీ పట్టడం లేదు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు...

14 ఏళ్ల పిల్లాడికి లారీ స్టీరింగ్ ఇచ్చిన డ్రైవర్.. మందలించిన ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: మైనర్లతో డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు, ప్రభుత్వం అవగాహన కల్పించినప్పటికీ కొందరికి అవేవీ పట్టడం లేదు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నిత్యం ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు చూస్తున్నా తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే ఓ తండ్రి ఫూటుగా మద్యం తాగి కొడుకుతో ఎంత పని చేయించారో తెలిసిందే మీరూ విమర్శలు కురిపిస్తారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఓ లారీ డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి లారీలో కూర్చుకున్నారు.

అయితే ఆయన 14 ఏళ్ల వయసు ఉన్న తన కుమారుడికి స్ట్రీరింగ్ పట్టించారు. ఇంకేముందు నేషనల్ హైవేపై లారీ సూపర్ స్పీడులో వెళ్తోంది. కుమారుడు కూడా ఎంతో ఉత్సాహంతో లారీ నడిపారు. అయితే ఈ దృశ్యం స్థానిక ఎమ్మెల్యే కాకార్ల సురేష్ కంట పడింది. దీంతో లారీని అడ్డుకున్నారు. తండ్రికొడుకులను కిందకు దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమక్షంలో లారీ డ్రైవర్‌కు క్లాస్ తీసుకున్నారు. పోలీసులతో కేసు నమోదు చేయించారు. లారీని సీజ్ చేయించారు. ఇంత జరుగుతుంటే లారీ ఓనర్‌ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఓనర్ కలిసే వరకు లారీని విడిచిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. దీంతో జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది..

Next Story