- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) తాడిపత్రి(Tadipatri)లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabhakar Reddy), వైసీపీ మాజీ ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy) మధ్య కొంతకాలంగా రాజకీయ అధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తండ్రుల నుంచి కుమారుల సమరం మొదలైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జస్మిత్ రెడ్డి, పెద్దారెడ్డి హర్షవర్ధన్ రెడ్డిగా రాజకీయం మారింది. ఇటీవల జరిగిన ఘర్షణల్లో పెద్దారెడ్డి కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. జేసీ ప్రభాకరెడ్డి కారు డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు అయింది.
జేసీ అస్మిత్ రెడ్డిపై కంప్లైంట్
ఈ నేపథ్యంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి(Tadipatri MLA JC Asmith Reddy) నుంచి ప్రాణహాని ఉందని పెద్దారెడ్డి కుమారుడు వైసీపీ నేత కేతిరెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆయన ఎస్పీని కలిశారు. జేసీ అస్మిత్ రెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని వినతి పత్రం అందజేశారు. దీంతో ఎస్సీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. హర్షవర్ధన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాడిపత్రి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేస్తారేమో చూడాలి.






