- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయండి : ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయండి : ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎస్టీఐ ) ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎస్టీఐ ) ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఈ విషయమై సోమవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసి ఎంపీ రఘునందన్ రావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సిద్దిపేటలో ఎన్ఎస్టీఐ ఏర్పాటు ద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరించి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు.
Next Story






