- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సారెస్పీ జలాశయంలో లభ్యమైన నాలుగో మృతదేహం
by Kodari Anjali |
ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన విషాద ఘటనలో గల్లంతైన వారిలో నాలుగో యువకుడి మృతదేహం లభ్యమైంది.

X
దిశ, ముప్కాల్: సెలవు రోజు కావడంతో సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన విషాద ఘటనలో గల్లంతైన వారిలో నాలుగో యువకుడి మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలను ఆదివారం వెలికితీయగా.. మరో యువకుడు అర్హన్ (22) మృతదేహం ఉదయం సోమవారం లభ్యమైంది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story






