- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. రావి కుంట కబ్జా పై ఇంటెలిజెన్స్ ఆరా
by Jakkula.Mamatha |
రావి కుంట కబ్జా పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

X
దిశ, నల్లగొండ బ్యూరో: రావి కుంట కబ్జా పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. మేళ్ల దుప్పలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 5.38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుంటను గ్రామానికి చెందిన ఓ భూస్వామి కబ్జా చేశారని తెలిసింది. అదే విషయాన్ని "దిశ " పత్రికలో ప్రచురితమైంది. ఆక్రమణపై పూర్తి వివరాలు స్వయంగా తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రావి కుంటను సందర్శించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకున్నట్లు సమాచారం. సాయంత్రం వరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వినికిడి.
Next Story






