- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
పంజాబ్ లో బీజేపీ కార్యాలయంపై దుండుగులు పెట్రోల్ బాంబ్ తో దాడి చేయడం తీవ్ర కలకలంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కార్యాలయంపై దుండగులు పెట్రోల్ బాంబు (petrol bomb)తో దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ షాకింగ్ సంఘటన పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి ముసుగుతో వచ్చిన దుండగులు భారతీయ జనతా పార్టీ (BJP) కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు. ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. బాంబు విసిరి పరారైన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీసు అధికారుల బృందం ఉప్లీ రోడ్డులో ఉన్న బీజేపీ కార్యాలయానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. కాంపౌండ్ బయట గోడ వైపు నుంచి మంటలు అంటిస్తున్న పెట్రోల్ సీసాను భవనం వైపు విసిరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు మీడియాకు తెలిపారు.






