- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలుచటి చీరలో మెరిసిన శోభా శెట్టి.. నడుము, బ్యాక్ అందాలతో చూపులు కట్టిపడేస్తోంది
Sobha Shetty dazzles in a sheer saree; she captivates onlookers with the beauty of her waist and back.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'కార్తీకదీపం' సీరియల్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న మోనిత పాత్రలో అద్భుతంగా నటించి విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శోభా, అనంతరం బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొని మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శోభా శెట్టి, తరచూ స్టైలిష్ ఫొటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా స్కై బ్లూ రంగు పలుచటి చీరకు మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేసి గ్లామరస్ లుక్‌లో మెరిసింది. తన నడుము, బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా విభిన్న కోణాల్లో ఇచ్చిన ఫోజులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
చీరకు, బ్లౌజ్‌కు సరిపోయే ఇయర్‌రింగ్స్, నుదిటిపై చిన్న బొట్టు, చేతికి గాజులు, విరబోసిన కురులు ఆమె లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
మొత్తంగా ఈ ఫొటోషూట్‌లో శోభా శెట్టి స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్‌లో కనిపించడంతో ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






