ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు.. ‘డ్రాగన్’ నుంచి క్రేజీ అప్డేట్!

by Mallepaka Hamsa |

ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ దిగ్గజ నటుడు మనోజ్ బాజ్‌పేయిని సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు.. ‘డ్రాగన్’ నుంచి క్రేజీ అప్డేట్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’. ఈ సినిమాను 1967 నాటి నల్లమందు సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందిస్తున్నారు. మైత్రీ మైవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్, కోసరాజు హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా వేగంగా సాగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై అత్యంత భారీ స్థాయిలో ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ సీన్ సినిమాలోనే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని సమాచారం. ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ దిగ్గజ నటుడు మనోజ్ బాజ్‌పేయిని సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. కథ నచ్చడంతో ఆయన కూడా నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. మనోజ్ బాయ్‌పేయి ఎంట్రీ ఉంటే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ‘కె.జి.యఫ్’, ‘సలార్’ చిత్రాల కంటే భిన్నమైన మేకింగ్‌తో ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు టాక్.

Next Story