చేతబడిపై కామాక్షి భాస్కర్ల షాకింగ్ కామెంట్స్.. ఇంటిముందు కచ్చితంగా అది పెట్టాలంటూ డిమాండ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-27 07:13:30  IST  )

సమాజంలో ప్రజలకు రకరకాల నమ్మకాలు ఉంటాయని, అయితే వాటిని తాను చూసే విధానం వేరని ఆమె తెలిపారు.

చేతబడిపై కామాక్షి భాస్కర్ల షాకింగ్ కామెంట్స్.. ఇంటిముందు కచ్చితంగా అది పెట్టాలంటూ డిమాండ్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అగధ’. నిర్మాతగా పలు సూపర్ హిట్స్ నిర్మించిన ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందిచిన ఈ చిత్రంలో శ్రమన్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోనికా వనిత విజయ్ కుమార్, సిజ్జు రోషన్, శ్రేయరాణి రెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న థియేటర్స్‌ విడుదల చేయబోతున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ జోరు పెంచిన మూవీ టీమ్ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయంలో బోనం సమర్చించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఎంత బిజీగా ఉన్నప్పటికీ కామాక్షి భాస్కర్ల సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆమెకు ఓ నెటిజన్ నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.

మీపై ఎప్పుడైనా ఎవరైనా చేతబడి చేశారా అని సదరు నెటిజన్ అడిగారు. ఈ ప్రశ్నకు కామాక్షి ఎంతో సమయస్ఫూర్తితో సమాధానమిచ్చారు. సమాజంలో ప్రజలకు రకరకాల నమ్మకాలు ఉంటాయని, అయితే వాటిని తాను చూసే విధానం వేరని ఆమె తెలిపారు. జీవితం ఇప్పటికే ఎన్నో రహస్యాలతో నిండి ఉందని, అలాంటప్పుడు దానికి కాస్త హాస్యాన్ని జోడిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కొన్నిసార్లు భయం అనిపించినప్పుడు ఎదురుగా చిన్న చిరునవ్వు చిందించి, మనస్పూర్తిగా నవ్వుకుంటూ ప్రతీ విషయాన్ని మరీ సీరియస్‌గా తీసుకోకుండా ఉండటమే మంచిదని చెప్పారు. అంతేకాకుండా, ఒకవేళ ఎవరైనా తమ ఇంటి బయట చేతబడి కోసం నిమ్మకాయలు పెడితే.. వాటితో పాటు కాస్త పంచదార కూడా పెట్టడం మర్చిపోవద్దని ఆమె సరదాగాఅన్నారు. ఆ నిమ్మకాయలు, పంచదారతో చక్కగా జ్యూస్ చేసుకుని తాగేస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఇచ్చిన దిమ్మతిరికే ఆన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Next Story