- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జై హనుమాన్’ సినిమాలో రానా దగ్గుబాటి!
ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు.. దానికి రెండు, మూడు భాగాలు తీస్తూ ప్రేక్షకులు మెచ్చే కంటెంట్‌ను అందిస్తున్నారు మన మేకర్స్. ఈ ట్రెండ్‌లోనే 2024 సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈనేపథ్యంలోనే మేకర్స్ దీని రెండో భాగాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ‘జై హనుమాన్’కు సంబంధించిన షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ‘హనుమంతుడి’ పాత్రలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వార్తలు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. పౌరాణికంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ‘అశ్వత్థామ’ పాత్రలో రానా నటించనున్నట్లు టాక్ . ఒకవేళ ఇదే నిజమైతే రిషబ్ శెట్టి, రానాలాంటి పవర్ హౌస్ యాక్టర్స్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.






