- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ సీఎం చంద్రబాబును కలుస్తాం: వల్లభనేని వంశీ
కృష్ణా జిల్లా రైతుల సమస్యలపై గన్నవరం వైసీపీ ఇంచార్జి, వల్లభనేని వంశీ దృష్టి సారించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు...

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krisha District) రైతుల సమస్యల(Farmers Problems)పై గన్నవరం వైసీపీ ఇంచార్జి, వల్లభనేని వంశీ(Gannavaram Ycp Incharge Vallabhaneni Vamsi ) దృష్టి సారించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడి(Cm Chandrababu)కి లేఖ రాశారు. సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేకాదు గత ఘటననను కూడా గుర్తు చేశారు. గతంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రైతుల సమస్యలను విన్నవించుకున్నామని తెలిపారు. అప్పుడు కూడా ఆయన సమస్యను పరిష్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. తనను కలిసేందుకు ముఖ్యమంత్రికి ఇబ్బంది అయితే రైతులు మాత్రమే వచ్చి సమస్యను వివరిస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు అనుమతి ఇస్తే తాను కూడా కలుస్తానని వల్లభనేని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాపై లెన్‌నినో ఎఫెక్ట్
కాగా కృష్ణా జిల్లాపై లెన్‌నినో ఎఫెక్ట్ పడింది. జులై చివరి వారానికి వచ్చినా ఆశించిన వర్షాలు లేక సాగుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం పరిసరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో రైతులు స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలకు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. సమస్య తీవ్రతను వివరించారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.






