- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రాహ్మణపల్లి గ్రామంలో కోతుల బెడద
by Jakkula.Mamatha |
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కోతుల బెడద రోజు రోజుకి శృతిమించిపోతుంది.

X
దిశ, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కోతుల బెడద రోజు రోజుకి శృతిమించిపోతుంది. పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పై దాడులు చేస్తూ గాయాలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిని కోతులు గాయపరచాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తేజ(14) అనే బాలుడిపై కోతి దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. కోతుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు విన్నవించుకున్న పాలక సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గం, అధికారులు స్పందించి కోతుల నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు..
Next Story






