- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలకు రూ. 2 లక్షల జీతం.. అయినా పేదవాడి లాగే ఫీలవుతున్నానని టెకీ ఆవేదన
నెలకు దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ పేదవాడిలాగే భావిస్తున్నానని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియా వేదికగా వాపోయారు.

దిశ, వెబ్ డెస్క్: సామాన్యుడు నెలకు 10 నుంచి 20 వేల జీతం ఉన్నా సరే ఎంతో ఆనందంగా బ్రతక గలుగుతున్నాడు. కానీ ఓ టెకీ మాత్రం తనకు నెలవారీ జీతం లక్షల్లో ఉన్నప్పటికీ పేదవాడి లాగే ఫీలవుతున్నానని చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. పెద్ద నగరాల్లో పెరిగిపోయిన జీవన వ్యయం సాధారణ ఉద్యోగులను ఏ స్థాయిలో మానసిక ఒత్తిడికి గురిచేస్తుందో ఈ సంఘటన స్పష్టం చేసింది. నెలకు దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ, ఎలాంటి అప్పులు (ఈఎంఐలు) లేకపోయినప్పటికీ తాను ఒక పేదవాడిలాగే భావిస్తున్నానని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియా వేదికగా వాపోయారు.
ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరంలో విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయం, అలాగే ఒక సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే కోరిక తనను నిరంతరం తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ టెకీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో మెట్రో నగరాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక పరిస్థితులపై నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. హౌసింగ్ రెంట్లు, నిత్యావసర ధరలు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు ఆకాశాన్నంటుతుండటంతో లక్షల్లో జీతాలు అందుకుంటున్న ఐటీ ఉద్యోగులు కూడా పొదుపు చేయలేక తీవ్రమైన క్షోభను అనుభవిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఉన్నప్పటికీ నగరాల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉద్యోగులలో సేవింగ్స్, భవిష్యత్తుపై భయాలను పెంచుతోందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని నెటిజన్లు, విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.






