- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముదిగొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్క్ పాలన
'గెలుపు అంటేనే భట్టి విక్రమార్క.. భట్టి అంటేనే గెలుపు' అనే స్థాయిలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు

దిశ, ముదిగొండ: 'గెలుపు అంటేనే భట్టి విక్రమార్క.. భట్టి అంటేనే గెలుపు' అనే స్థాయిలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే, ఈ గుర్తింపు ఆయనది మాత్రమే కాదు.. ఆయనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న మధిర ప్రజలది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. మధిర ఎమ్మెల్యేగా మాత్రం ఆయనే విజయం సాధిస్తున్నారు. ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా, నియోజకవర్గ ప్రజలు మాత్రం భట్టికే బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన మంచితనం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, అందించిన సేవలే ఆయనను వరుస విజయాల తీరాలకు చేరుస్తున్నాయి.
రాజకీయ ప్రవేశం..
2007–2009 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎమ్మెల్సీ ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం 2009 మధిర నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009–2011 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గా కొనసాగారు. 2011–2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉన్నారు.2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 2014–2018 లో 1వ తెలంగాణ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 2018లో మధిర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2019 సంవత్సరంలో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు (లీడర్ అఫ్ ఒప్పొసిషన్)ఉంటూ 2019–2023 కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) నాయకుడిగా కొనసాగారు. కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర 2023 వ సంవత్సరం లో మధిర నియోజకవర్గం నుంచి 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి 7 డిసెంబర్ 2023 తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.2023–2026 ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.
అభివృద్ధికి బాటలు..
మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలంలో మండల కేంద్రం లో నూతన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, పలు గ్రామాలకు రైతుల కోసం నూతన గోడౌన్లు, పలు గ్రామాలలో నూతన కరెంట్ సబ్ స్టేషన్లు, పలు గ్రామాల్లో గుళ్ళు పునరాభివృద్ధి నిధులు మంజూరు, అతి ముఖ్యంగా ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా కొన్ని వందల కోట్లతో తారు రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణానికి కృషి చేశారు. మండలంలో ఎక్కడ చూసినా, చూడాలి అనుకున్న కూడా మట్టి రోడ్లు కనుమరుగైపోయాయి.
రైతుల పొలాలకు గతంలో పొలాలకు వెళ్లాలంటే భయం భయంగా వెళ్లేవారు పాములు, తేళ్లు ఎక్కడ కూడతాయో అని కానీ ఇప్పుడు రైతులు ధైర్యంగా కారు రోడ్డుపై పొలాలకు వెళుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న హైస్కూల్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మారుస్తూ నిధులు కేటాయింపు. పలు గ్రామాలలో చెరువులను పర్యాట కేంద్రాలుగా మారుస్తూ చెరువుల పునరుద్దీకరణకు కృషి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క బాటలు వేస్తూ, తనదైన శైలిలో మార్క్ చూపిస్తున్నారు. ఇలాంటి నాయకుడు కావాలని మళ్ళీ మళ్ళీ రావాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.






