ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

by Naga Rani Yarlagadda |

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఆలయ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసీని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై పిటిషన్ దారులకు ఏమైనా అనుమానాలుంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంటూ.. రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ప్రభుత్వ స్థలంలో రామాలయాన్ని నిర్మించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆలయం ఎందుకు నిర్మించకూడదో సమాధానం ఇవ్వాలని నాలుగు వారాలు గడువు ఇచ్చిన ధర్మాసనం.. నేడు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అక్కడ 80 సంవత్సరాలుగా రామాలయం ఉన్నట్లు కలెక్టర్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఎన్ఓసీలో తెలిపారు. అన్నీ పరిశీలించాకే నిర్మాణానికి అనుమతి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.

Next Story