పాన్ ఇండియా మూవీలో వీరనారిగా భూమి పెడ్నేకర్.. నన్ను పూర్తిగా కొత్త కోణంలో చూస్తారంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ భారీ సినిమాలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని ఆమె తెలిపారు. కర్ణాటకకు చెందిన వీరనారి బెలవాడి మల్లమ్మ పాత్రను తెరపై పోషించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు.

పాన్ ఇండియా మూవీలో  వీరనారిగా భూమి పెడ్నేకర్.. నన్ను పూర్తిగా కొత్త కోణంలో చూస్తారంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘కాంతార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి.. ఓ బయోపిక్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మూవీ ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’. ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె ధైర్యసాహసాలకు మారుపేరైన వీరనారి 'బెలవాడి మల్లమ్మ' పాత్రను పోషించనున్నారు. ఇక ఈ చిత్రంలో భాగమవ్వడంపై భూమి పెడ్నేకర్ సంతోషం వ్యక్తం చేశారు. గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ సినిమాలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని ఆమె తెలిపారు. కర్ణాటకకు చెందిన వీరనారి బెలవాడి మల్లమ్మ పాత్రను తెరపై పోషించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు.

తాను ‘కాంతార’ సినిమాకు పెద్ద ఫ్యాన్‌నని, అందులో రిషబ్ శెట్టి నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. అందుకే దర్శకుడు సందీప్ కథ చెప్పిన వెంటనే ఆ పాత్రకు ఓకే చెప్పినట్లు వివరించారు. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నమైనదని, తనను ఒక కొత్త కోణంలో చూపించబోతున్నందుకు మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. లెజెండ్ స్టూడియోస్, ఇమ్మర్సో బ్యానర్స్‌పై ఈ మూవీని సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. దీనిని వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు.

Next Story