- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీవెన్స్ డే.. ఉదయం 10:42 దాటినా ముగ్గురే హాజరు!
మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం అపహస్యంగా మారింది.

దిశ, ఏన్కూరు: మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం అపహస్యంగా మారింది. రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం 24 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా సోమవారం ఉదయం 10:42 గంటలకు మూడు శాఖలకు చెందిన అధికారులు హాజరు కావడం గమనార్హం. ఆ సమయానికి వెళ్లాల్సిన పని ఏముంది? మాకు మాత్రం పనులు లేవా అన్నట్లుగా కొన్ని శాఖల అధికారులు వ్యవహరిస్తున్నారని బహిరంగ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం సర్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. తహసీల్దార్ శేషగిరిరావు మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే సర్ ప్రోగ్రామును ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించడం జరుగుతుంది.
ప్రజావాణికి హాజరు కావలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ హాజరు కాకపోవడం అధికారుల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులు హాజరైన దాఖలాలు లేవని, హాజరు కావలసిన అన్ని శాఖల అధికారులు సమయానికి గ్రీవెన్స్ హాజరయ్యే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ శేషగిరిరావు వివరణ కోరగా.. తాను సర్ ప్రోగ్రాంలో భాగంగా మండలంలో పర్యటిస్తున్నానని ఆఫీసుకు వచ్చిన తర్వాత గైర్హాజరైన శాఖల అధికారులు వివరాలను నివేదిక ఉన్నతాధికారులు పంపిస్తానని తెలిపారు.






