విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు

by Jakkula.Mamatha |

కొండాపూర్‌లో విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు
X

దిశ, శేరిలింగంపల్లి: కొండాపూర్‌లో విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ యువతి తనపై జరిగిన లైంగిక వేధింపులపై గచ్చిబౌలి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రియుడి కోసం నెదర్లాండ్స్ నుంచి భారత్‌కు వచ్చిన యువతి.. కొండాపూర్‌లో కో లివింగ్ హాస్టల్లో అతనితో కలిసి ఉంటుంది. అక్కడ అదే గదిలో ఉంటున్న మరో యువకుడు ఆదిత్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. దీంతో తిరిగి నెదర్లాండ్స్‌కు వెళ్లిన ఆమె అక్కడ భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. మూడు రోజుల క్రితం మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన బాధితురాలు.. గచ్చిబౌలి పోలీసులను కలిసి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.

Next Story