- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
మద్యం మత్తులో కారు నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

దిశ, రాజేంద్రనగర్: మద్యం మత్తులో కారు నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ ప్రమాదం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయం సమీపంలో జరిగింది. ఆదివారం రాత్రి అతి వేగంతో వచ్చిన ఎరుపు రంగు స్కోడా ర్యాపిడ్ కార్ టీఎస్ 09 ఎఫ్‌బీ 4554 రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదానికి గురైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగాక కారును ఆపకుండా ముందుకు వెళుతున్న మానస హిల్స్ కు చెందిన సాయి నితిన్(22)ను స్థానికులు పట్టుకున్నారు. సాయి నితిన్ మద్యం తాగి, నిలబడే పరిస్థితిలో కూడా లేకపోవడంతో తన పేరు కూడా చెప్పలేకపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో సాయి నితిన్‌కు 180 పాయింట్లు(బీఏసీ) వచ్చింది. కారులో ఉన్న ఒక యువతి ఏ విషయాన్ని చెప్పడానికి నిరాకరించింది.సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సాయి నితిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






