జైనాబ్‌పై అలాంటి విమర్శలు.. అవన్నీ మాకేం సమస్య కాదంటూ ట్రోలర్స్ నోళ్లు మూయించిన అఖిల్

by Mallepaka Hamsa |

తమ మధ్య ఉన్న వయసు, మతం వంటి విషయాలు తనకు ఏమాత్రం సమస్య కాదని అఖిల్ స్పష్టం చేశారు.

జైనాబ్‌పై అలాంటి విమర్శలు.. అవన్నీ మాకేం సమస్య కాదంటూ ట్రోలర్స్ నోళ్లు మూయించిన అఖిల్
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్, జైనాబ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది జూన్‌లో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంటపై ఇప్పటికీ దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే పెళ్లి నాటి నుంచి వారి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, మతం వంటి విషయాలపై సోషల్ మీడియాలో నిరంతరం విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా ఈ తీవ్రమైన ట్రోలింగ్‌పై అఖిల్ మొదటిసారి స్పందించారు. తమ మధ్య ఉన్న వయసు, మతం వంటి విషయాలు తనకు ఏమాత్రం సమస్య కాదని అఖిల్ స్పష్టం చేశారు. పెళ్లికి ముందే వీటన్నింటిపై తామిద్దరం స్పష్టంగా చర్చించుకున్నామని చెప్పారు. కొన్ని నెలల పాటు వచ్చే ట్రోలింగ్ గురించి ఆలోచించాలా లేదా రాబోయే 50 ఏళ్ల తమ సంతోషకరమైన జీవితం గురించి ఆలోచించాలా అని ఆలోచించి, నెగెటివిటీని పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

పెళ్లి తర్వాత ఇలాంటి పోస్టులు వస్తాయని ముందే జైనాబ్‌కు చెప్పి మానసికంగా సిద్ధం చేశానని, వచ్చిన ప్రతి ట్రోల్‌ను ఒక దీవెనగా భావించామని అన్నారు. కులం, మతం, వయసు కంటే తమ మధ్య ఉన్న ప్రేమ, అవగాహనే గొప్పదని ఆయన పేర్కొన్నారు. తాను మానసికంగా, శారీరకంగా కష్టాల్లో ఉన్న సమయంలో జైనాబ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే తమ బంధం మరింత బలపడిందని చెప్పారు. సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి ఆమెను రక్షించనప్పటికీ, జైనాబ్ ఈ విషయంలో ఎంతో పరిణతితో వ్యవహరించిందని ప్రశంసలు కురిపించారు. తమ ఐదేళ్ల రిలేషన్‌షిప్‌లో ఆమె తనను బాగా అర్థం చేసుకుందని వెల్లడించారు. కాగా.. అఖిల్ సినిమాల విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా ఫ్లాపుల్లో ఉన్న ఆయన ఇటీవల లెనిన్ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖఆతాలో వేసుకున్నారు. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. మూడేళ్ల గ్యాప్ తర్వాత గట్టి కంబ్యాక్ ఇచ్చిన అఖిల్ అయ్యాగారే నంబర్‌వన్ అని అనిపించుకున్నారు.

Next Story