- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసుపు చీరలో గ్లామర్ టచ్.. వయ్యారాలు ఒలకబోస్తున్న ప్రజ్ఞా నగ్రా
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సూపర్ హాట్‌గా ప్రజ్ఞా నగ్రా.

దిశ, వెబ్ డెస్క్: అందాల భామ ప్రజ్ఞా నగ్రా తమిళ చిత్రం 'వరలారు ముక్కియం'తో వెండితెరకు పరిచయమైంది. అనంతరం 'లగ్గం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రజ్ఞా నగ్రాకు పెద్దగా గుర్తింపు రాలేదు.
. అయినప్పటికీ అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రజ్ఞా నగ్రా, తరచూ స్టైలిష్ ఫొటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందాల విందుతో నెట్టింట సందడి చేసింది.
ఎల్లో కలర్ చీరకు చంకీలు పొదిగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేసి స్టన్నింగ్ లుక్‌లో మెరిసింది. చీర పల్లును కాస్త పక్కకు జరిపి ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఇచ్చిన ఫోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. భారీ ఇయర్‌రింగ్స్ ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, విరబోసిన కురులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి.
మొత్తం మీద ఈ ఫొటోషూట్‌లో ప్రజ్ఞా నగ్రా సూపర్ హాట్ లుక్‌లో మెరిసిపోవడంతో ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు "బ్యూటిఫుల్", "స్టన్నింగ్", "క్యూట్" అంటూ కామెంట్లు చేస్తూ, లవ్, ఫైర్ ఎమోజీలతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Photos Courtesy: Instagram






