- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్షన్‌కు పవర్‌ఫుల్ కంటెంట్ జోడిస్తే ‘పొలిమేర-3’.. స్పెషల్ వీడియోతో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
ఈ మూడో భాగంలో యాక్షన్ స్టార్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దిశ, సినిమా: ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకులను కట్టిపడే కంటెంట్‌తో పెను సంచలనం సృష్టించింది ‘పొలిమేర’. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల నటించిన ఈ చిత్రం ఎంతోమందిని ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పొలిమేర-2’తెరకెక్కించగా.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న ‘పొలిమేర-3’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మూవీ టీమ్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ మూడో భాగంలో యాక్షన్ స్టార్ అర్జున్ సర్జా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆయనకు స్వాగతం పలుకుతూ ‘యాక్షన్ మీట్స్ పవర్.. సెన్సేషన్ సృష్టించే కంటెంట్‌తో రాబోతోంది’ అనే క్యాప్షన్‌తో ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అర్జున్ ఎంట్రీ ఇస్తూ విలన్లను చితకబాదడం, నోట్లో సిగరెట్‌తో వైల్డ్ లుక్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది. చేతబడి, క్షుద్ర పూజలు, పల్లెటూరి నేపథ్యంలోని థ్రిల్లింగ్ అంశాలతో ఈ కథ సాగనుందని తెలుస్తోంది. గత రెండు భాగాలను అద్భుతంగా తెరకెక్కించిన అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనిలి నారంగ్ ప్రజెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ‘పొలిమేర-2’ ముగింపులో మిగిలిన సస్పెన్స్ ప్రశ్నలకు ఈ మూడో భాగంలో సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్న అభిమానులకు, అర్జున్ రాకతో సినిమా రేంజ్ మరింత పెరిగినట్లయింది.






