లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

by Jakkula.Mamatha |

లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం 44వ జాతీయ పై చోటు చేసుకుంది.

లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
X

దిశ,ఉండవెల్లి: లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం 44వ జాతీయ పై చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో బెంగళూరుకు ఇంటర్సిటీ స్మార్ట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. 44వ జాతీయ రహదారి ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర ముందు వెళుతున్న లారీని ఇంటర్సిటీ స్మార్ట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

Next Story