ఎల్-నినో ప్రభావం.. నేటి నుంచి తలకొండపల్లిలో విత్తన మేళా

by Jakkula.Mamatha |

ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ కాలంలో పండే పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రేణుక చక్రవర్తిని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎల్-నినో ప్రభావం.. నేటి నుంచి తలకొండపల్లిలో విత్తన మేళా
X

దిశ,తలకొండపల్లి: ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ కాలంలో పండే పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రేణుక చక్రవర్తిని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు తలకొండపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విత్తన మేళా కొనసాగనుంది.

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విత్తన మేళాలో జొన్న, పెసర, మినుము, కంది, సునపులు, పొద్దుతిరుగుడు, వరి తదితర పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నష్టాలు రాకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విత్తన మేళాకు హాజరై నాణ్యమైన విత్తనాలు, సాగు సలహాలు పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

Next Story