- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే అదృష్టమో తెలుసా? సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?
పుట్టుమచ్చలు కేవలం అందానికి గుర్తులే కాదు. మన అదృష్టం, ఆర్థిక స్థితి, వ్యక్తిత్వం, జీవిత ప్రయాణాన్ని కూడా సూచిస్తాయంటూ సాముద్రిక శాస్త్రం విశేషాలను చెబుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పుట్టుమచ్చలు కేవలం అందానికి గుర్తులే కాదు. మన అదృష్టం, ఆర్థిక స్థితి, వ్యక్తిత్వం, జీవిత ప్రయాణాన్ని కూడా సూచిస్తాయంటూ సాముద్రిక శాస్త్రం విశేషాలను చెబుతోంది. శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలు శుభదాయకంగా లేదా అపశకునంగా భావించబడతాయని నమ్మకం ఉంది. ఇవి శాస్త్రీయంగా నిరూపించబడకపోయినా, పూర్వీకుల అనుభవాల ఆధారంగా చాలా మందికి ఇవి ఆసక్తికరంగా ఉంటున్నాయి. మరి ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టానికి సంకేతం అవుతుందో చూద్దాం.
నుదిటిపై పుట్టుమచ్చ
కుడి వైపు: ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నవారు ధనవంతులు, గౌరవనీయులై ఉంటారని నమ్మకం. జీవితం మొత్తంలో విజయం వారి వశం.
ఎడమ వైపు: కొంత మేరకు ఫిజూలుగా ఖర్చు చేసే స్వభావం ఉందని భావిస్తారు.
కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారు చాలా తెలివిగలవారు, ఆధ్యాత్మిక ధోరణి కలిగి ఉంటారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు కొరత అనేది జీవితంలో రావద్దని అనుకుంటారు.
ముక్కు చివర పుట్టుమచ్చ ఉండటం తరచూ ప్రయాణాలకే సంకేతం. అలాంటి వారు జీవితంలో చాలాచోట్ల తిరుగుతారు. మంచి విజయాలను చవిచూస్తారు.
పై పెదవి కుడి వైపు పుట్టుమచ్చ ఉన్నవారు సహృదయులు, ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ప్రేమ, గౌరవం కలిగిన జీవితం గడుపుతారు.
కుడి చేతిలో (ఉంగరపు వేలు లేదా చిటికెన వేలు కింద): సంపద, అదృష్టానికి ప్రతీక. ఈ వ్యక్తులు జీవన స్థాయిలో ఉన్నతస్థాయికి చేరతారు.
ఎడమ చేతిలో పుట్టుమచ్చ ఉన్నవారు కొంత కష్టపడాల్సి వస్తుంది. కానీ చివరకు విజయం వారి సాధనమే.
అరికాళ్ళపై పుట్టుమచ్చ ఉన్నవారు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. విదేశీ యాత్రలకు అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఉండే వీరు సవాళ్లను అధిగమిస్తూ జీవితంలో మంచి పేరు సంపాదిస్తారు.
కడుపుపై పుట్టుమచ్చ సంపద, భోగాన్ని సూచిస్తుంది. నాభి వద్ద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు. కానీ, కొన్నిసార్లు ఇది అధికంగా తినే అలవాటును కూడా సూచించవచ్చని సాముద్రిక నిపుణులు అంటున్నారు.
పుట్టుమచ్చల గురించి చెప్పే విషయాలు ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉండవచ్చు. ఇది నమ్మకం మీద ఆధారపడిన విషయం. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఈ విశ్లేషణలు వ్యక్తిత్వ విశ్లేషణగా ఉపయోగపడతాయని భావించవచ్చు.






