ఏంటి భయ్యా ఇది.. భర్త మీద కోపం ఉంటే ఎవరైనా ఇలా చేస్తారా..? ఒళ్లు హూనం అయిపోయిందిగా..

by Gugulothu.Kavitha |

ప్రస్తుత జనరేషనల్‌లో సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే.

ఏంటి భయ్యా ఇది.. భర్త మీద కోపం ఉంటే ఎవరైనా ఇలా చేస్తారా..? ఒళ్లు హూనం అయిపోయిందిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత జనరేషనల్‌లో సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. చిన్నా, పెద్దా, ముసలి, ముతక అని తేడా లేకుండా దీన్ని తెగ వాడేస్తున్నారు. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని నెట్టింట్లో పెట్టేస్తున్నారు. దీంతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో భార్య భర్తలకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే చాలా మంది వాటికి కనెక్ట్ అవుతారు కాబట్టి. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ జంట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. సరిగ్గా ఆ టైంకే కొంతమంది దుండగులు వచ్చి భర్త తలపై ముసుగు కప్పేస్తారు. అంతే ఇక చాన్స్ దొరికిందిరా అన్నట్లు ఆ భార్య తన భర్తను పొట్టు పొట్టుగా కొట్టి తన మీద ఉన్న కోపం మొత్తం తీర్చుకుంటుంది. ఇక దెబ్బలు తట్టుకోలేక ఎలాగోల భర్త ముసుగు తీస్తాడు. వెంటనే అలర్ట్ అయిన భార్య ఎవరు డియర్ వాళ్లు.. నిన్ను ఎందుకు కొడుతున్నారు అని ఏం తెలియనట్టు అడుగుతుంది.

ఇక బాగా దెబ్బలు తిన్న భర్త బాధతోనే ఏమో తెలీదు అని అంటాడు. ఇక్కడితో ఈ వీడియో కాస్తా అయిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఏంది భయ్యా కోపం ఉంటే మరి ఇంతలా కొడతారా అని, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేసిన కుట్ర అని, సింగిల్స్ బతికిపోయామంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోలో కనిపించిన వారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. వారు నిత్యం ఇలాంటి ఫన్నీ వీడియోలతో నెటిజన్లును ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story