Video Viral:ఇదేమి ఐడియా బ్రో.. ఫ్రిజ్‌ను అలా కూడా యూజ్ చేయొచ్చా?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-31 07:09:10  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వింతలు చూస్తున్నాం.

Video Viral:ఇదేమి ఐడియా బ్రో.. ఫ్రిజ్‌ను అలా కూడా యూజ్ చేయొచ్చా?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వింతలు చూస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన క్షణాల్లో సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్షమవుతుంది. ఇక, సోషల్ మీడియాలో వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు నిత్యం దర్శనమిస్తునే ఉన్నాయి. కొన్ని ఘటనలు ఆశ్చర్యాన్ని కలిగించేవిగా, మరికొన్ని షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆశ్చర్యకరమైన ఘటన నెట్టింట చక్కర్లు కొడుతుంది.

వైరల్ వీడియో ప్రకారం.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా రిఫ్రిజిరేటర్‌ ఉంటుంది. ఈ క్రమంలో నీరు, కూరగాయలు, ఆహారం, స్వీట్లు మొదలైనవి పాడైపోకుండా ఫ్రిజ్‌లో పెట్టుకుంటారనే సంగతి తెలిసిందే. ఇక ఫ్రిజ్‌లో అడుగు భాగాన ఉన్న బాక్స్ లో కూరగాయలను పెట్టుకుంటారు. కానీ.. ఒక వ్యక్తి వెరైటీగా ఆలోచించారు. ఆ వ్యక్తి ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో లో ఒక వ్యక్తి ఫ్రిజ్ తెరుస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో వివిధ వస్తువులు కనిపిస్తున్నాయి. కానీ, కింది భాగాన ఉన్నా బాక్స్‌లో మాత్రం కూరగాయలకు బదులుగా నీటిని ఉంచారు. ఆ నీటిలో ప్రాణంతో ఉన్న పెద్ద చేపలు పెట్టారు. ఫ్రిజ్‌లో ‘అక్వేరియం’ ఏర్పాటు చేసిన ఆ వ్యక్తి ఆలోచనకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. పలువురు వాట్ ఏ థింకింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Next Story